గ్రూప్-2 విజేత శివకుమార్‌కు సన్మానం


Mon,November 4, 2019 02:02 AM

నీలగిరి: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి అసిస్టెంట్ రిజిస్టార్‌గా సహకారశాఖలో ఉద్యోగం సంపాదించిన విశ్వనాథుల శివకుమార్‌ను జాతీయ యువజన అవార్డు గ్రహీత గంజి రాజేందర్, పద్మానగర్‌కాలనీ యవకులు ఆదివారం ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జాతీయ యువజన అవార్డు గ్రహీత రాజేందర్ మాట్లాడుతూ కష్టపడి చదివి పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించడంతోపాటు గ్రూప్-2లో విజయం సాధించారన్నారు. చిన్నతనంలో శివకుమార్ తండ్రి చనిపోయినప్పటికీ తల్లి రాములమ్మ కూలీపని చేస్తూ పిల్లలను చదివించారన్నారు. కష్టపడి చదివి చదువుకు పేదరికం అడ్డురాదని నిరూపించి తన తల్లి నమ్మకాన్ని నిలబెట్టారన్నారు. యువత శివకుమార్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చోల్లేటి శివప్రసాద్, వడ్డేపల్లి సురేష్, మల్లికార్జున్, పున్న సోమనాథ్, పొట్టబత్తుల నాగరాజు, మహేష్, లక్ష్మణాచారి, కర్నాటి వీరాంజనేయులు, కైరంకొండ నవీన్, సూదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి రవీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...