పనితీరులో నిబద్ధత కనబర్చాలి


Sat,November 2, 2019 01:08 AM

-ప్రజలకు మెరుగైన సేవలందించాలి
-సైబర్‌నేరగాళ్ల మోసాలపై ప్రజలను అప్రమత్తంచేయాలి
-ఏఎస్పీ నర్మద
-ఐటీసెల్, సైబర్ క్రైం విభాగాల పరిశీలన
నల్లగొండ సిటీ : జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఐటీసెల్, సైబర్ క్రైం విభాగాలను శుక్రవారం ఏఎస్పీ నర్మద పరిశీలించారు. ఐటీ సెల్ సీఐ సురేశ్‌బాబుతో కలిసి సైబర్ క్రైం, సెల్ పనితీరు, ఐటీ సెల్ కార్యకలాపాల గురించి తెలుసుకున్నారు. నేర నియంత్రణలో ఐటీ సెల్ కృషి, లేజర్ గన్, ఈ ఛానల్స్, ఫంక్షనల్ వర్టికల్స్, డీఎస్‌ఆర్, పాయింట్ బుక్స్, జీయో ట్యాకింగ్‌తో పాటు పాత నేరస్తుల కదిలికలపై నిఘా తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనితీరులో నిబద్ధత కనబరుస్తూ మరింత సమగ్రవంతంగా ముందుకు సాగాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించడం కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా వినియోగిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్ట పెరిగే విధంగా చూడాలని తెలిపారు. మారుతున్న పరిస్థితుల్లో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని వీటి పట్ల ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు వివిధ రూపాల్లో ప్రజలను, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రలోభాలకు గురిచేస్తూ ఆర్థ్ధిక నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఇది ప్రమాదకరంగా మారందని వీరిపట్ల ప్రజలలో అవగాహన పెంపొందించడానికి ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలు మోసపోకుండా ఉండేందుకు సైబర్ సెల్ కృషి చేయాలన్నారు. అనంతరం ఆమె కేంద్ర ఫిర్యాదుల విభాగాన్ని పరిశీలించి ఫిర్యాదుల ఆన్‌లైన్, పరిష్కారమైన కేసులు, బాధితులకు వారి సమస్యకు సంబంధించిన పురోగతిపై సమాచారం ఏ విధంగా ఇస్తున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ట్రాఫిక్ ఎస్‌ఐ కొండల్‌రెడ్డి, సిబ్బంది నర్సింహ, శ్రీకాంత్, రియాజ్‌ఉన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...