వల్లభాయ్ పటేల్ సేవలు మరువలేనివి


Fri,November 1, 2019 01:34 AM

శాలిగౌరారం : భారతదేశ మాజీ ఉపప్రధాని స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చామల వెంకటరమణారెడ్డి అన్నారు. సర్దార్ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు గుజిలాల్ శేఖర్‌బాబు, చామల సురేందర్‌రెడ్డి, బట్ట వీరబాబు, సురేశ్‌గౌడ్, శ్రీను, వీరభద్రయ్య, వెంకన్న పాల్గొన్నారు.మర్రిగూడ : మండలకేంద్రంలోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో గురువారం సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కార్యక్రమంలో సర్పంచ్ నల్ల యాదయ్య, నెహ్రూ యువకేంద్రం జాతీయ యువజన నాయకులు రవి, రాములు, శ్రీరాంగౌడ్, శ్రీనివాస్, సైదులు, లింగయ్య, రఘు, అంజి, దశరథ, రమేశ్, రాఖీ, శేఖర్, పరమేశ్, గోకుల్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ గ్రామశాఖ ఆధ్వర్యంలో పాతబస్టాండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు చెరుకు శ్రీరాంగౌడ్, గోపాల్, పరుశురాం, లింగయ్య, సైదులు, జగదీశ్ పాల్గొన్నారు. చిట్యాల : పట్టణంలో గురువారం వల్లభాయ్ పటేల్ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో గంజి గోవర్ధన్, చికిలంమెట్ల అశోక్, పల్లె వెంకన్న, కంచర్ల శంకర్‌రెడ్డి, మహాలింగం, సతీశ్, నర్సింహులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...