ఇందిరాగాంధీకి ఘన నివాళి


Fri,November 1, 2019 01:34 AM

చండూరు, నమస్తే తెలంగాణ : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని గురువారం మండలకేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక చౌరస్తాలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పన్నాల లింగయ్య, కారింగు రామ్మూర్తి, దోటి వెంకటేశ్‌యాదవ్, సాపిడి రాములు, ఖుద్దూస్, కట్ట అంజయ్య, మల్లేశ్, మాస కృష్ణ, బొమ్మరబోయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. చిట్యాల : చిట్యాల పట్టణంలో ఇందిరా గాంధీ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దుబ్బాక వెంకట్‌రెడ్డి, నాయకులు పోకల దేవదాసు, శేపూరి యాదయ్య, రెముడాల మధు, బోడ స్వామి, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...