నేటి నుంచి విద్యా సంస్థలు పునః ప్రారంభం


Mon,October 21, 2019 01:52 AM

నల్లగొండ విద్యావిభాగం: పొడిగించిన దసరా సెలవులు ఆదివారంతో ముగియడంతో సోమవారం నుంచి విద్యా సంస్థలు పునః ప్రారంభం కానున్నాయి. ప్రతి సంవత్సరం దసరా సెలవులను ప్రకటించడం విధితమే. అయితే ఈ పర్యాయం 28 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 13 వరకు 16 రోజుల సెలవులను రాష్ట్ర విద్యాశాఖ అమలు చేసింది. ఈ నేపధ్యంలో ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగారు. దీంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ సెలవులను అక్టోబర్ 14 నుంచి 20 వరకు పొడిగించారు. గతంలో ఎన్నడూలేని విధంగా 23 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు వచ్చాయి. తిరిగి నేటి నుంచి దీంతో ఆయా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల సందడి షురూ కానుంది. అయితే సెలవుల్లో ఆట పాటలతో మునిగి తేలిన విద్యార్థి లోకం ఇక పాఠశాలల్లో పుస్తకాలను చేతబట్టి చదువులు సాగించనుండటం విశేషం.

ఆట పాటలకు ఇక సెలవు...
సుధీర్ఘంగా 23 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు రావడంతో ఆట పాటల్లో మునిగి తేలిన విద్యార్థులు ఇక వాటికి స్వస్తి పలుకనున్నారు. పుస్తకాలను చేతబూని సోమవారం నుంచి బడి బాట పట్టనున్నారు. ఈ నెల 25 నుంచి పాఠశాలలో విద్యార్థులకు ఎఫ్‌ఏ1 (సమ్మిట్ ఎసిస్‌మెంట్) పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే పాఠశల విద్యా కమిషనర్ నుంచి ఆదేశాలు జారీ అ య్యాయి. దీంతో విద్యార్థులను ఆ పరీక్షలకు విద్యార్థులను ఉపాధ్యాయులు సన్నద్ధం చేయనున్నారు. అయితే ఎస్‌ఏ1కు సంబంధించిన పరీక్షల ప్రశ్నపత్రాలు ఆయా మండలాల ఎంఈఓ కార్యాలయాలకు సోమవారం చేరనున్నట్లు తెలిసింది. అక్కడికి చేరిన ప్రశ్నపత్రాలను పా ఠశాలల వారీగా అందజేసి రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసిన కాలనిర్ణయ పట్టిక మేరకు పరీక్షలు జరిగేలా జిల్లా విద్యాశాఖ సమాయాత్తం అవుతున్నట్లు తెలుస్తోంది.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...