ప్రజా రక్షణే పోలీస్ ధ్యేయం : ఏఎస్పీ


Mon,October 21, 2019 01:51 AM

నల్లగొండసిటీ : ప్రజా రక్షణే పోలీసుల ప్రథమ కర్తవ్యమని, నిత్యం సమాజంలో జరిగే నేరాలను అరికడుతూ ప్రజలంతా శాంతియుత వాతావరణంలో జీవించే పరిస్థితులు కల్పించడం లక్ష్యంగా పని చేస్తామని అదనపు ఎస్పీ పద్మనాభరెడ్డి అన్నారు. పోలీస్ అమరుల సంస్మరణలో భాగంగా ఆదివారం రాత్రి పోలీస్ అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబసభ్యులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ అమరవీరుల ఆశయాల సాధనతో పాటు ప్రజల రక్షణ కోసం ఎలా చనిపోయారో తెలుసుకుని ముందుకుసాగాలని సూచించారు. అనంతరం పోలీస్ కార్యాలయం నుంచి క్లాక్‌టవర్, జిల్లా పోలీస్ కార్యాలయం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఏఆర్ డీఎస్పీ సురేశ్‌కుమార్, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామచంద్రగౌడ్, సోమయ్య, ఆర్‌ఐలు వై.వి.ప్రతాప్, శంకర్, నర్సింహాచారి, ఆర్‌ఎస్‌ఐలు హసన్‌అలీ, సిబ్బంది వెంకన్న, కిషన్, సైదులు, ప్రదీప్, రామలింగం పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...