క్రీడాకారులకు అండగా స్పోర్ట్స్ అసోసియేషన్


Mon,October 21, 2019 01:51 AM

దేవరకొండ, నమస్తేతెలంగాణ : దేవరకొండ ప్రాంత క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించడం అభినందనీయం అని దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్‌వీటీ అన్నారు. టీఏఎఫ్‌టీవైజీఏఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 29నుంచి అక్టోబర్ 3వరకు నేపాల్‌లో జరిగిన థర్డ్ ఇంటర్నేషనల్ యూత్ గేమ్స్-2019 కబడ్డీ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొన్న దేవరకొండ నివాసి గడ్డం రాహుల్ గోల్డ్ మెడల్ సాధించడాన్ని పురస్కరించుకొని ఆదివారం దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. రాహుల్ ప్రయాణ ఖర్చుల కోసం రూ.15వేలు ఆర్థికసాయం అందజేసిన దేవరకొండ జడ్పీటీసీ మారుపాకుల అరుణ సురేష్‌గౌడ్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారులు, కళాకారులకు స్పో ర్ట్స్ అసోసియేషన్ అండ గా ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మారుపాకుల సురేష్‌గౌడ్, స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు కృష్ణ కిశోర్, పంతులాల్, రాపోలు నిరంజన్, జె చంద్రయ్య, భాస్కర్‌రెడ్డి, తాళ్ల సురేష్, సుజాత, వి సురేష్, రమేష్, పూర్య నాయక్, వీవీఆర్, కుమార్, ఎర్ర కృష్ణ, గడ్డం రాజేష్, నాగేంద్ర, శ్రీనివాస్ రెడ్డి, వీవీరెడ్డి, శ్రీను, జగన్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...