విద్యుత్ సమస్యలకు చెక్


Mon,October 21, 2019 01:51 AM

తిప్పర్తి : పల్లెల అభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో కృషిచేస్తోంది. ఇప్పటికే ఎన్నో పనులు చేపట్టి గ్రామీణప్రాంతాల పురోభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోంది. ఈక్రమంలో ఇటీవల ప్రవేశపెట్టిన 30రోజుల ప్రణాళిక కార్యక్రమంతో గ్రామాలన్నీ పరిశుభ్రంగా మారాయి. గ్రామాల్లో కంపచెట్లు, పిచ్చిమొక్కలు తొలగించడంతోపాటు, పాత బావులు, పాత గోడలను కూల్చివేశారు. గ్రామాలలో పచ్చదనం సంతరించుకొవాలని ప్రతి గ్రామంలో విధిగా మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టారు. వీటితోపాటు గ్రామీణ ప్రాంతాల్లో గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యుత్ సమస్యలన్నీ పరిష్కరించి కష్టాలు తొలిగించారు. ప్రత్యేక నిధులు కేటాయించి విద్యుత్ సమస్యలు పరిష్కరించారు. గతంలో నాటిన ఇనుప స్తంభాలకు ఎర్త్‌వచ్చి ప్రజలు ఇబ్బందులు పడేవారు. వీధిదీపాలు పగలంతా వెలిగేవి. లూజ్‌లైన్లు, విరిగిన స్తంభాలతో ప్రజలు భయపడేవారు. మండలంలో సుమారు రూ.60 లక్షల నిధులతో కరెంట్ సమస్యలన్నీ తీర్చారు. మొత్తం మండలంలో 350పైగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. 120అదనపు వీధిదీపాలకు కొత్త మీటర్ల ఏర్పాటు చేశారు. దీంతోపాటు లూజ్ లైన్ సుమారు 600స్కార్ వైర్‌ను లాగారు. మండలంలో విద్యుత్ సమస్యలు పరిష్కారం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...