అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి


Mon,October 21, 2019 01:50 AM

నల్లగొండ సిటీ : పోలీసు అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయ సాధనకోసం కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఏఎస్పీ పద్మనాభరెడ్డి అన్నారు. పోలీసు అమరుల సంస్మరణలో భాగంగా ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా ప్రజలకు రక్షణ కల్పిస్తు, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విరోచితంగా సంఘ విద్రోహశక్తులను ఎదుర్కొన్న పోలీసు అమరుల త్యాగాలను స్మరించుకోవాలని సూచించారు. రక్తదానం ద్వారా మరో వ్యక్తి ప్రాణం కాపాడవచ్చన్నారు. రక్తదానం శిబిరం ఏర్పాటు చేసిన పోలీసు సిబ్బంది, యువకులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ పుల్లారావు, డాక్టర్లు రాజశేఖర్‌రెడ్డి, జయప్రకాశ్, వసంతకూమారి, అనితరాణి, హుస్సేన్‌రెడ్డి, ప్రవీణ్, ప్రవళిక, నల్లగొండ డీఎస్పీ గంగారాం, ఏఆర్ డీఎస్పీ సురేష్‌కుమార్, పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రామచంద్రగౌడ్, నాయకులు సోమయ్య, జయరాజ్, ఆర్‌ఐలు వైవి ప్రతాప్, శంకర్, స్పర్జన్‌రాజ్, నరసింహాచారి, నల్లగొండ వన్‌టౌన్ సీఐ సురేష్, రూరల్ ఏస్సై రాజశేఖర్‌రెడ్డి, ప్రభుత్వ బ్లడ్‌బ్యాంక్ సిబ్బంది ప్రశాంత్, శ్రవణ్, కొండల్, గణేష్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సిరిగిరి సురేష్‌రెడ్డి, పలువురు రక్తదాతలు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...