ఉప ఎన్నికలో సైదిరెడ్డి గెలుపు ఖాయం


Sun,October 20, 2019 04:21 AM

హుజూర్‌నగర్‌రూరల్ : హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో సైదిరెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. పట్టణంలో ముదిరాజ్ సంఘం నాయకులు, సభ్యులు మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ బండా ప్రకాశ్ సమక్షంలో శనివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఓటమి భయంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి ఉత్తమ్ ఎన్నికల్లో గెలుపుకోసం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులని ఈ బెదిరింపులకు, గుంటనక్క రాజకీయాలకు ఉత్తమ్‌కు తగిన బుద్ధ్ది చెబుతారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్ ఎమ్మెల్సీ భానుప్రసాద్, పెద్ద సంఖ్యలో ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...