ముగిసిన ప్రచార హోరు


Sun,October 20, 2019 04:20 AM

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. శనివారం సాయంత్రం 5గంటలతో ప్రచారం ముగియడంతో సోమవారం జరిగే పోలింగ్‌కు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. ఇన్నాళ్లుగా మైక్‌లతో, ఎల్‌ఈడీలతో మార్మోగించిన ప్రచారాలన్నీ ముగిసాయి. సెప్టెంబర్ 23 నుండి 30 వరకు నామినేషన్ల స్వీకరణ చేయగా, 1వ తేదీన నామినేషన్లను పరిశీలించారు. 3వ తేదీన ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్ వేసిన పలువురు విత్‌డ్రాలను చేసుకోగా చివరకు 28మంది అభ్యర్థులు మిగిలారు. వీరిలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు నియోజకవర్గంలోని 141గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహించి ప్రజలను తమ ప్రసంగాలతో అకట్టుకున్నారు. ప్రచారంలో టీఆర్‌ఎస్ రాష్ట్రస్థాయి నాయకులు మంత్రులు కేటీఆర్, జగదీష్‌రెడ్డి, సత్యవతిరాథోడులు ప్రచారాన్ని నిర్వహించగా సమన్వయ బాధ్యతలను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నిర్వహించారు. ఇప్పటికే అధికార టీఆర్‌ఎస్ పార్టీతోపాటు ఆయా పార్టీల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులంతా సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేయగా రేపు జరిగే పోలింగ్‌పై ప్రధాన దృష్టి సారించారు. ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ పోలింగ్ జరుగనుండగా ఈనెల 24న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 2,36,646 మంది ఓటర్లు ఉండగా 302పోలింగ్ కేంద్రాలను ఓటు వినియోగం కోసం ఏర్పాట్లు చేశారు. టీఆర్‌ఎస్ నుంచి శానంపూడి సైదిరెడ్డి బరిలో ఉండగా కాంగ్రెస్ నుంచి కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి, బీజేపీ తరఫున కోట రామారావు, టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయి, సహా స్వతంత్య్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉప ఎన్నిక ఉండటంతో బార్ దుకాణాలను మూసి వేయాలని ఎన్నికల కమిషన్ పరిశీలకులు ఆదేశాలను జారీ చేశారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...