యాదాద్రిలో భక్తుల కోలాహలం


Sun,October 20, 2019 04:19 AM

యాదగిరిగుట్ట, నమస్తే తెలంగాణ : యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ కొనసాగింది. ధర్మ దర్శనానికి 2గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన, నిత్యపూజలు జరిపారు. ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించారు. 8 గంటలకు శ్రీసుదర్శన హోమం జరిపి శ్రీవారిని కొలిచారు. నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖమండపంలోనే ఊరేగించారు. రూ.100 టిక్కెట్‌పై అష్టోత్తర పూజలు పెద్దఎత్తున జరిగాయి. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, అంజనేయస్వామికి సహస్రనామార్చన, సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని భీమన్నగట్ట మఠం రాఘవేంద్ర స్వామిజీ దర్శించుకున్నారు. మధ్యాహ్నం సమయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

శ్రీవారి ఖజానాకు రూ.9,56,487 ఆదాయం
ప్రధాన బుకింగ్‌తో రూ.1,43,538, రూ.150 టిక్కెట్ దర్శనంతో రూ.63,100, ప్రసాద విక్రయాలతో రూ.3,75,765, వ్రత పూజలతో రూ.69,500, కల్యాణకట్టతో రూ.26,000, టోల్‌గేట్ ద్వారా రూ.1,300, శాశ్వత పూజలతో రూ.10,232, అన్న ప్రసాదంతో రూ.18,595, వాహనపూజలతో రూ.19,700, ఇతర విభాగాలతో రూ.2,28,757 కలిపి మొత్తం రూ.9,56,487 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ గీత తెలిపారు.

స్వామివారికి ఒడిబియ్యం సమర్పించుకున్న స్వీట్జర్లాండ్ దేశస్తురాలు... యాదాద్రిశ్రీలక్ష్మీనరసింహస్వామివారికి స్వీట్జర్లాండ్ దేశస్తురాలు క్రిస్టేనియా శనివారం ఒడి బియ్యం సమర్పించుకున్నారు. సంప్రదాయ దుస్తులో వచ్చిన క్రిస్టేనియా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 36 సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్న దేవస్థానాలు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తానని ఆమె తెలిపారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...