సాగర్‌డ్యాంపై ఆక్టోపస్ మాక్ డ్రిల్


Sat,October 19, 2019 02:26 AM

నందికొండ : నాగార్జునసాగర్ డ్యాంపై తెలంగాణ, ఆంధ్రా రాష్ట్ర డీజీ అధికారులు సంయుక్తంగా ఆక్టోపస్ దళాలతో ఆపరేషన్ మాక్ డ్రిల్‌ను గురువారం రాత్రి నిర్వహించారు. నాగార్జునసాగర్ డ్యాం ఎడమ, కుడి, గ్యాలరీ, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం నుంచి ఉగ్రవాదులు దాడి చేస్తే ఏవిధంగా తిప్పికొట్టాలి అనే అంశంపై ఆక్టోపస్ దళాలాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఆక్టోపస్ దళాలలో కొందరు ఉగ్రవాదులుగా విడిపోయి వారు దాడి చేస్తుంటే వారిని ఎదుర్కొనే వాస్తవ పరిస్థితులను తలపించేలా రాత్రి మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ డ్యాంకు ఉగ్రవాదుల ముప్పు ఉందని ఇంటెలిజెన్సీ అధికారుల సమాచారంతో ముందస్తుగా మాక్ డ్రిల్ నిర్వహించామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రా రాష్ర్టాలకు చెందిన 120 మంది ఆక్టోపస్ దళ సభ్యులు, పోలీస్, ఎస్‌పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...