ప్రతి పాఠశాలపై ప్రత్యేక దృష్టి పెడతాం


Fri,October 18, 2019 02:26 AM

మండలంలోని మీర్జాపూర్ సర్జాఖాన్‌పేట ఉన్నత పాఠశాలల్లో హిందీ ఉపాధ్యాయులు లేక పాఠాలు జరగడం లేదని తమ దృష్టికి వచ్చిందని, సెలవుల అనంతరం ఈ పాఠశాలల్లో హిందీ పాఠాలు జరిగేలా డిప్యుటేషన్‌పై ఉపాధ్యాయులను నియమిస్తామన్నారు. అదే విధంగా సర్జాఖాన్‌పేట పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, పురాతన కట్టడాల రక్షణకు జిల్లా కలెక్టర్ రూ.50 వేలు మంజూరు చేశారని, వీటితో త్వరలో మరమ్మతు పనులు నిర్వహిస్తామని తెలిపారు. మండలంలోని ప్రతి పాఠశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎస్సెస్సీ ఫలితాల్లో అగ్రభాగాన నిలిచేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో మండల విద్యాధికారి, ఎమ్మార్సీ సిబ్బంది పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...