జాతీయ స్థాయి


Fri,October 18, 2019 02:25 AM

ఖోఖో పోటీలకు గురుకుల విద్యార్థిని
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్ : గుజరాత్ రాష్ట్రం సూరత్‌లో ఈనెల 19 నుంచి 21 వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి ఖోఖో టోర్నీ లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు జిల్లా కేంద్రంలోని డిగ్రీ గురుకుల కళాశాల విద్యార్థిని కృష్ణమ్మ ఎంపికైంది. బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న కృష్ణమ్మ ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభకనబర్చడంతో రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. గురువారం కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి విద్యార్థినిని అభినందించారు. జాతీయ స్థాయి ఖోఖో టోర్నీలో ప్రతిభ చాటి జట్టు విజయానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పీడీ పద్మావతి, నారాయణపేట పీఈటీ మొగులాల్ పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...