అండర్-17 బాలబాలికల


Fri,October 18, 2019 02:24 AM

-కబడ్డీ పోటీల విజేతగా నల్గొండ జట్లు
హుజూర్‌నగర్‌రూరల్ : 65వ తెలంగాణ రాష్ట్ర స్థాయి పాఠశాలల క్రీడల సమాఖ్య నిర్వహించిన అండర్-17 బాలబాలికల కబడ్డీ పోటీల విజేతలుగా నల్గొండ జిల్లా జట్లు నిలిచాయి. గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లలో బాలుర జట్టు ఆదిలాబాద్ జట్టుపై గెలుపొందగా, బాలికల జట్టు మహబూబ్‌నగర్ జట్టుపై విజయం సాధించింది. బాలుర విభాగంలో రెండో బహుమతి ఆదిలాబాద్ జట్టు, మూడో బహుమతి కరీంనగర్, నాలుగో బహుమతి రంగాడ్డి జిల్లా జట్లు గెలుచుకున్నాయి. బాలికల విభాగంలో ద్వితీయ బహుమతి మహబూబ్‌నగర్ మూడో బహుమతి వరంగల్, నాలుగో బహుమతి ఖమ్మం జట్లు సాధించాయి. విజేతలుగా నిలిచిన జట్లకు జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ బహుమతులు అందించారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...