నేడు మద్యం షాపుల కేటాయింపునకు డ్రా


Fri,October 18, 2019 02:23 AM

-ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంకరయ్య
నల్లగొండ సిటీ : 2019-21వరకు రెండేళ్లపాటు మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తులు చేసుకున్న వారికి శుక్రవారం కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా తీసి షాపులు కేటాయించనున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంకరయ్య గురువారం ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు ఉదయం 10 గంటలకు మర్రిగూడ బైపాస్‌లోని ఎంఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్‌కు రావాలని కోరారు. దరఖాస్తుదారులకు ఎంట్రీ పాస్‌లు కేటాయిస్తామని పాస్‌లు ఉన్న వారికే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. డ్రా సమయంలో దరఖాస్తుదారులు విధిగా ఉండాలని లేకపోతే అనర్హులుగా ప్రకటిస్తామని పేర్కొన్నారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...