హమాలీ కార్మికుల ఘర్షణ


Thu,October 17, 2019 02:35 AM

నల్లగొండ సిటీ: హమాలీ యూనియన్ల మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరి ఇరు వర్గాలు ఘర్షణ పడి రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడిన ఘటన బుధవారం జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలో హమాలీలు రెండు యూనియన్లలో సభ్యులుగా ఉన్నారు. గతంలో అన్ని యూనియన్లు కలిసి సరుకు దిగుమతి చేసేవారు. కానీ కొంతకాలంగా పనుల విషయంలో రెండు యూనియన్ల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయమై ఇటీవల ఇరువర్గాలు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. బుధవారం హైదరాబాద్‌రోడ్డులో సిమెంట్‌లారీ నుంచి బస్తాలు దించే విషయంలో ఇరువర్గాలకు విభేదాలు చోటుచేసుకున్నాయి. లారీ నుంచి తామే దింపుతామంటూ రెండు యూనియన్లకు చెందిన హమాలీలు ఘర్షణ పడ్డారు. రాళ్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో ఇరువర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీ పుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేయనున్నట్లు తెలిపారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...