బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి


Thu,October 17, 2019 02:34 AM

మఠంపల్లి : బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని ఇంకా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉందని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. బుధవారం మట్టపల్లి గ్రా మంలో నిర్వహించిన బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆంధ్రా పాలనలో ఎన్నో అవమానాలు, అవహేళనలకు గురైన బ్రాహ్మణులు 2014లో అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆత్మగౌరవం పెరిగిందని స్పష్టం చేశారు. బ్రాహ్మణులకు సంక్షే మ ఫలాలు అందించిన టీఆర్‌ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. రూ.100కోట్లతో బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ వర్గాలతో సమానంగా పథకాలు అమలు చేశారన్నారు. బ్రాహ్మణ విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించేందుకు రూ.20లక్షలు ఉపకార వేతనం అందజేస్తున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్ మాత్రమేనన్నారు. సీఎం కేసీఆర్ రుణం తీర్చుకునేందుకు హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి గెలిపించాలని కోరారు.

బ్రాహ్మణుల మద్దతు కోరిన శానంపూడి రజిత
ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేయాలని బ్రాహ్మణులను ఎమ్మెల్యే అభ్యర్ధి సైదిరెడ్డి సతీమణి శానంపూడి రజిత మద్దతు కోరారు. అందరి బాగు కోసం పూజలు చేసేది బ్రాహ్మణులని.. బహుజన ప్రియులని కొనియాడారు. అర్చకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయాల పునరుద్ధ్దరణ కోసం దూప దీప నైవేద్యానికి అర్చకులకు రూ.6వేలు వేతనం ఇస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో కేంద్రమాజీ మంత్రి వేణుగోపాలాచారి, ఎమ్మెల్సీ పురాణం సతీష్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్, టీఆర్‌ఎస్ నాయకుడు చకిలం అనిల్‌కుమార్, బ్రాహ్మణసంఘం నాయకులు నారపురాజు శ్రీనివాసరావు, కోటేశ్వర్‌రావు, బాచుమంచి చంద్రశేఖర్, పురుషోత్తంరావు, రామారావు, హరి, లక్ష్మణరావు తదితరులున్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...