కార్పొరేట్‌కు దీటుగా గురుకులాలు


Tue,October 15, 2019 02:17 AM

-విద్యకు సీఎం కేసీఆర్ పెద్దపీట
-విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
-ఒలంపిక్స్‌లో పాల్గొనే స్థాయికి ఎదగాలి
-గురుకుల పాఠశాలల డిప్యూటీ సెక్రటరీ శక్రునాయక్
-డిండిలో 6వ జోనల్ స్థాయి క్రీడాపోటీలు ప్రారంభం

డిండి : కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా గురుకులాలను సీఎం కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారని గురుకుల పాఠశాలల రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ శక్రునాయక్ అన్నారు. గురుకుల పాఠశాలల అభివృద్ధికి, విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.సోమవారం మండ ల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలిక గురుకుల పాఠశాలలో గురుకుల పాఠశాలల బాలికల అండర్-14, 17,19 విభాగం 6వజోనల్ స్థాయి క్రీడల పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను డిండి ఎంపీపీ సునీతజనార్దన్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాలల విద్యార్థ్ధులు తమ ప్రతిభకు మరింత మెరుగులు దిద్దుకొని రాబోయే ఒలంపిక్‌లో పాల్గొనే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గు ర్రపు స్వారీకూడా గురుకుల పాఠశాలల విద్యార్థులకు నే ర్పిస్తున్నారని తెలిపా రు. క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఉన్నత విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్‌న్లు కల్పిస్తూ ప్రభు త్వం ప్రోత్సహిస్తుందన్నారు. ఎంపీపీ సునీతజనార్దన్‌రావు మాట్లాడుతూ విద్యార్థ్ధులు క్రమశిక్షణతో విద్యాభ్యాసం చే యడంతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు.

డిండి మండ లం కామేపల్లి గ్రామానికి చెందిన మాయవతి అథ్లెటిక్స్‌లో దక్షిణ భారత స్థాయి పోటీల్లో స్వర్ణపతకం సాధించడం సంతోషంగా ఉందన్నారు. గురుకుల విద్యార్థ్ధులను ఆణిముత్యాలుగా తీర్చిదిద్దుతున్న పీఈటీలు, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు.ప్రిన్సిపాల్ సీహెచ్. పద్మ మాట్లాడుతూ క్రీడలు విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. అంతకు ముందు విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 53పాఠశాలల నుంచి మొత్తం 1100మంది విద్యార్థులు ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గిరిబాబు, స్థానిక స ర్పంచ్ మేకల సాయమ్మకాశన్న, ఉపసర్పంచ్ వెంకటేశ్, ఎంపీటీసీలు రాధిక, వెంకటయ్య, ఆర్‌సీఓలు, డీసీఓలు, వివి ధ పాఠశాలల ప్రిన్సిపాల్స్, పీడీ, పీఈటీలు పాలొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...