సాగర్‌కు 84563 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో


Tue,October 15, 2019 02:14 AM

నందికొండ : నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు ఎగు వ కృష్ణా పరివాహక ప్రాజెక్టుల నుంచి ఇన్‌ఫ్లో పెరుగు తూ, తగ్గతూ ఉండడంతో డ్యాం క్రస్టు గేట్ల ద్వారా నీటి విడుదలను అదే స్థాయిలో కొనసాగిస్తున్నారు. సోమవారం ఇన్‌ఫ్లో తగ్గడంతో డ్యాం 2 క్రస్టు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగిస్తున్నారు. శ్రీశైలం ఒక క్రస్టు గేటు, జలవిద్యుత్ కేంద్రాల ద్వారా సాగర్‌కు 84,563 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా, సాగర్ డ్యాం 2 క్రస్టు గేట్ల ద్వారా 29946 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

నీటి సమాచారం
నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 590లకు గాను 589.90 అడుగులకు చేరుకొని 311.4474టీఎంసీల నీరు సోమవారం నిల్వ ఉంది. సాగర్ జలాశయం ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 32130క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 92 57 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 10120 క్యూసెక్కు లు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800 క్యూసెక్కులు, డీటీ గే ట్సు (డైవర్షన్ టన్నెల్) ద్వారా 10, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు, క్రస్టు గేట్ల ద్వారా 29946 క్యూసెకుల నీటి విడుదల కొనసాగుతుంది. సాగర్ రిజర్వాయ ర్ నుంచి మొత్తం 84563 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 884.80 అడుగుల వద్ద 214.8450టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువనుంచి 101960 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది.

పులిచింతల @ 174.702 అడుగులు
చింతలపాలెం : పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175(45.77 టీఎంసీలు)లకు ప్రస్తుతం 174.702 (45.308 టీఎంసీలు) అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి సుమారు 94360 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. పులిచింతల ప్రాజెక్టు మొత్తం గేట్లు 24, కాగా 3 గేట్ల నుంచి 75360 క్యూసెక్కుల నీరు, గేట్ల్ల లీకేజీల ద్వారా 1000 క్యూసెక్కుల నీరు, తెలంగాణ విద్యుత్ ఉపకేంద్రం ద్వారా 18000 క్యూసెక్కుల నీరు, మొత్తం 94360 క్యూసె క్కుల నీరు అవుట్‌ఫ్లో విడుదలవుతుంది.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...