పరుగులు తీస్తున్న ఆర్టీసీ బస్సులు..


Mon,October 14, 2019 01:49 AM

దేవరకొండ, నమస్తేతెలంగాణ : దేవరకొండ డిపో పరిధిలో ఆర్టీసీ బస్సులు పరుగులు పెడుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టి తొమ్మిదిరోజులు గడుస్తున్నా ఆ ప్రభావం ప్రయాణికులపై పడకుండా దేవరకొండలో అధికారులు నిరాటంకంగా బస్సులు నడుపుతున్నారు. అధికారులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో ప్రయాణికులను సాఫీగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. ప్రయాణికులు సైతం ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణానికి మొగ్గుచూపుతున్నారు. దేవరకొండ డిపో పరిధిలో 103బస్సులుండగా ఆదివారం హైదరాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, అచ్చంపేట, కల్వకుర్తి మార్గాల్లో 68బస్సులు నడిపినట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. ఇందులో 40ఆర్టీసీ బస్సులు, 28 ప్రైవేటు బస్సులున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులు ఆర్టీసీ నిర్దేశించిన చార్జీలు మాత్రమే చెల్లించాలని, సిబ్బంది అధికంగా వసూలు చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...