హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయం : ఎంపీ కోమటిరెడ్డి


Sat,October 12, 2019 01:45 AM

నల్లగొండ సిటీ : హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం చర్లపల్లి సమీపంలోని ఎంఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలోని బాలాజీ హోమ్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతున్నామన్నారు. హుజూర్‌నగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ 30వేల మెజార్టీతో గెలుపొందుతుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిని గెలిపించడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. విలేకరుల సమావేశంలో నల్లగొండ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, ఎంపీపీ మనిమద్దె సుమన్, వైస్ ఎంపీపీ జిల్లేపల్లి పరమేష్, కనగల్ మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, తిప్పర్తి మండల అధ్యక్షుడు జూకూరి రమేష్, వెంకన్న పాల్గొన్నారు.తిప్పర్తి : హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తిప్పర్తి మండలకేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నకిరేకల్ నుంచి నల్లగొండ రోడ్డును మంజూరు చేయించడం జరిగిందని, త్వరలో బ్రహ్మణవెల్లెంల ప్రాజెక్టును కూడా పూర్తి చేయిస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పల్లే ఎల్లయ్య, నాయకులు గుండు శ్రీను, బద్ద జానయ్య, ప్రశాంత్, సోమరాజు పాల్గొన్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles