పశు సంపదతో ఆర్థికాభివృద్ధి


Fri,October 11, 2019 04:17 AM

- ప్రభుత్వం పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
- విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
- కనగల్‌లో కృత్రిమ గర్భధారణ కార్యక్రమం ప్రారంభం
- మైలసముద్రం, జి.ఎడవెల్లిలో చేపపిల్లలు వదిలిన మంత్రి
కనగల్ : పాడిపరిశ్రమ గ్రామీణ ప్రజలకు ఆదాయ వనరుగా నిలుస్తుందని, విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం కనగల్ మండలం జి.ఎడవెల్లి గ్రామంలో ఉచిత జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువుల్లో జన్యు సామర్థ్యాలను వృద్ధి చేయడం, ఉత్పాదకత పెంపునకు కృత్రిమ గర్భధారణ మేలని తెలిపారు. పాడి పరిశ్రమ ఉత్పాదకత, లాభార్జనకు పాడి రైతులకు అత్యంత సమర్థవంతమైన పద్ధతులు అవలంబించాలని సూచించారు. అనంతరం జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి మండల కేంద్రంలోని మైల సముద్రం, జి.ఎడవెల్లి ఊర చెరువులో చేప పిల్లలను వదిలారు.

కృతిమ గర్భధారణతోనే పశువుల్లో జన్యు లక్షణాలు అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలో జీయడవల్లి గ్రామంలో నిర్వహించిన 200 పాడి పశువుల్లో ఉచిత జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. ఈ పథకాన్ని రాష్ట్రంలోనే జి యడవల్లి గ్రామంలో మొదటగా ప్రారంభిస్తున్నామన్నారు.

పాడి పశువుల్లో జన్యు సామర్థ్యాలను వృద్ధి చేయడం ద్వారా వాటి ఉత్పాదకతను పెంపొందించేందుకు వినియోగించే కీలక విధానాలలో కృత్రిమ గర్భదారణ ఒకటన్నారు. పాడి పరిశ్రమలో ఉత్పాదకతను, లాభదాయకతను పెంచుకునేందుకు పాడి రైతులకు అందుబాటులో ఉన్న అత్యంత సమర్థవంతమైన సాధనలలో కృత్రిమ గర్భధారణ ఉంటుందన్నారు. కృత్రిమ గర్భదారణ విధానంలో అత్యున్నత నాణ్యత గల ఆంబోతులు, దున్నల విత్తన సామర్ధ్యాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చన్నారు. తక్కువ సమయంలోనే జాతి వారసత్వ పరీక్షలు చేయవచ్చన్నారు. మేలుజాతి దున్నలు, ఆంబోతుల వీర్యాన్ని ఆ పశువు మరణించిన తరువాత కూడా వినియోగించుకోవచ్చని వెల్లడించారు. కృత్రిమ గర్భధారణతో పశువుల్లో కూడా కట్టుశాతం పెరుగుతుందన్నారు. జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ సంకరజాతి పశుసంపదకు రైతులు తోడ్పాడాలన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలోనే జి యడవల్లి గ్రామంలో పశుసంపద అత్యధికంగా ఉందన్నారు. ఈ గ్రామంలో పాలకేంద్రానికి సొంత భవనం నిర్మించి పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం కృషిచేయాలని మంత్రికి విన్నవించారు. డీఎల్‌డీఏ చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగతా జిల్లాలోని పాడిరైతులందరికీ కృత్రిమ గర్భధారణ సౌకర్యాన్ని ఉచితంగా అందించేందుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి 6నెలల పాటు కృత్రిమ గర్భధారణ కార్యక్రమా న్ని చేపడుతుందన్నారు.

కృత్రిమ గర్భదారణ చేసిన పశువులన్నింటికి విశిష్ట గుర్తింపు సంఖ్యతో కూడి చెవి ట్యాగులు వేయబడుతుందన్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ పథకాన్ని 300గ్రామాల్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రూపాయి ఖర్చులేకుండా గోపాలమిత్రలు పశువులకు కృత్రిమ గర్భధారణ చేయిస్తారని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని మైల సము ద్రం, జి యడవల్లి గ్రామంలోని ఊరదక్షిణ చెరువులో చేపలను మంత్రి జగదీష్‌రెడ్డి బండా నరేందర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డిలతో కలిసి వదిలారు. మత్స్యకార్మికుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషిచేస్తుందన్నా రు. అదేవిధంగా జి యడవల్లి ఉన్నత పాఠశాలలో మొ క్కలు నాటారు. అంతకు ముందు మంత్రికి ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుష్పగుచ్ఛం అందజేసి ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, మత్స్యశాఖ జిల్లా అధికారి కోమటిరెడ్డి చరితరెడ్డి, ఎంపీపీ కరీంపాష, జడ్పీటీసీ వెంకటేశం, వైస్ ఎంపీపీ శ్రీధర్‌రావు, ఆత్మ చైర్మన్ సహదేవరెడ్డి, మండలాధ్యక్షుడు ఐతగోని యాదయ్యగౌడ్, ఎంపీడీఓ సోమసుందర్‌రెడ్డి, డాక్టర్లు శ్రీనివాస్‌రావు, జానయ్య, టీఆర్‌ఎస్ నాయకులు జొన్నలగడ్డ శేఖర్‌రెడ్డి, సుంకిరెడ్డి కేశవరెడ్డి, అల్గుబెల్లి నర్సింహారెడ్డి, దోటి శ్రీనివాస్, జిల్లా శంకర్, ఆవురేశి శ్రీనివాస్, కారింగు జానయ్య, బోయపల్లి జానయ్య, రాము, పులకరం యాదమ్మమారయ్య, ఎర్రమాద వెంకట్‌రెడ్డి, పాలకూరి సైదులు, బుషిగంపల యాద య్య, తలారి రవీందర్, హనుమంతు, సింగం కోటేశ్, రామలచ్చయ్య, దాసరి వెంకన్న ఉన్నారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...