తెలంగాణలో కాంగ్రెస్‌కు కాలం చెల్లింది


Fri,October 11, 2019 04:15 AM

- దళితులంతా టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలి
- రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ మందుల సామేలు
నేరేడుచర్ల : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ మందుల సామేలు అన్నారు. గురువారం స్థ్ధానిక టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాల్లో కూడా అమలు చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు ఏనాడు రైతుల గురించి ఆలోచించలేదని, నేడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి పెట్టుబడి సాయం అందిస్తుందన్నారు. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌పై నమ్మకం ఉందని ఆ నమ్మకంతోనే హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని అధిక మెజార్టీతో గెలిపిస్తారన్నారు. గత ప్రభుత్వ పాలనలో 320 రెసిడెన్సియల్ పాఠశాలలు ఉంటే తెలంగాణ ఏర్పిడిన తరువాత పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు 820 పాఠశాలను ప్రారంభించిందన్నారు. చిన్న రాష్ర్టాల ఆవాశ్యకత ఎంతో అవసరం ఉందని ఆనాడే డాక్టర్ బి.ఆర్ అంబేథ్కర్ వ్రాసిన రాజ్యంగంలోని ఆర్టికల్-3లో పొందుపర్చారని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న టీఆర్‌ఎస్‌కు దళితులంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ రాపోలు నర్సయ్య, కల్లూరు సర్పంచ్ పల్లెపంగ నాగరాజు, నన్నెపంగ సైదులు, గురవయ్య, సుదర్శన్ తదితరులు ఉన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...