సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్ర ప్రగతి


Fri,October 11, 2019 04:14 AM

- ఓయూ జేఏసీ అధ్యక్షుడు గుగులోతు శంకర్‌నాయక్
మఠంపల్లి : సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఓయూ జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ గుగులోతు శంకర్‌నాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ రూపంలో సీఎం కేసీఆర్ కనబడుతున్నాడని అన్నారు. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు గిరిజనుల అభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు. పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ ప్రాంతంలో 15సంవత్సరాల నుంచి ప్రసిద్ధి చెందిన లక్ష్మీనృసింహస్వామి ఆలయం ప్రాంగణంలో బంజారా సత్రం, నియోజకవర్గ కేంద్రంలో బంజారా భవనాలు నిర్మించలేదన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా శానంపూడి సైదిరెడ్డి గెలిచిన వెంటనే హుజూర్‌నగర్‌లో రూ. కోటితో బంజారా భవన్ నిర్మాణం జరిపిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపు కోసం గిరిజనులు కృషి చేయాలన్నారు. మాజీ ఎంపీపీ కొండానాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ రమణనాయక్, ఉమ్మడి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాంచందర్‌నాయక్, ఖమ్మం డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, జడ్పీటీసీ జగన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...