అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా


Sat,September 21, 2019 01:04 AM

మిర్యాలగూడ టౌన్ : ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడి ఐదుగురు భవన నిర్మాణ కార్మికులకు గాయాలయ్యాయి. పట్టణ పరిధిలో నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై శుక్రవారం ఈ ఘటన జరిగింది. బాధితులు, టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని వడ్డెరకాలనీకి చెందిన భవన నిర్మాణ కార్మికులు బైపాస్‌రోడ్డు వెంట ఉన్న ఓ వెంచర్‌లో గృహనిర్మాణ పనులకు వెళ్లి సాయం త్రం ట్రాక్టర్‌పై ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ట్రాక్టర్ నుంచి ఇనుపరాడ్డు జారి కిందపడగా కార్మికులు ఒక్కసారిగా కేకలు పెట్టడంతో డ్రైవర్ గుంజ కొండలు వెనక్కి తిరిగ్గా ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు దిగువకు దూసుకెళ్లి ట్రాక్టర్‌తోపాటు ట్రాలీకి అనుసంధానంగా ఉన్న కాంక్రీట్ మిక్సింగ్ యంత్రం సహా బోల్తాపడింది. ట్రాక్టర్‌లో పది మంది కార్మికులుండగా డ్రైవర్ కొండల్‌తోపాటు వేముల పద్మ అనే మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. కనకమ్మ, శిరీష, వెంకటరమణకు స్వల్ప గాయాలయ్యాయి. మిగిలిన ఐదుగురు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రులను 108వాహనంలో ఏరియా దవాఖానకు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. తీవ్రగాయాలైన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం పట్టణంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...