పెసర కొనుగోళ్లకు కేంద్రాలు సిద్ధం


Sat,September 21, 2019 01:04 AM

-l23న సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో ప్రారంభం
సూర్యాపేట వ్యవసాయం : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో ఈనెల 23న పెసర కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ అమయ్‌కుమార్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే మార్కెట్‌కు రైతులు పెసర్లను తీసుకొస్తుండడంతో గుర్తించిన అధికారులు వెంటనే కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పెసరకు మద్దతు ధర క్వింటాకు రూ.7050 అందించనున్నారు. జిల్లావ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా ఈసీజన్‌లో సుమారు 898 మెట్రిక్ టన్నుల పెసర్ల కొనుగోలుకు కేంద్రం అనుమతి లభించినట్లు అధికారులు తెలిపారు. రైతులు వారు పండించిన పంటను తక్కువ ధరకు దళారులకు అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసే కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధరను పొందాలని అధికారులు సూచిస్తున్నారు.

కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో పెసర కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లా అధికారులు, మార్కెట్ అధికారుల సూచనల మేరకు సోమవారం నుంచి మార్కెట్‌లో పెసర కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులు పెసర్లను తీసుకువచ్చి మద్దతు ధరను పొందాలి. - సునీత, మార్క్‌ఫెడ్ ఉమ్మడి జిల్లా అధికారి

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...