వైద్య వృత్తిలో నైతిక విలువలు పాటించాలి


Sat,September 21, 2019 01:03 AM

-కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
నీలగిరి : తెల్లకోటు వేయడమే గొప్పకాదు.. వైద్య వృత్తిలో నైతిక విలువలు పాటించాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. శుక్రవారం మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులకు తెల్లకోటు ధరింపు, మృతదేహాల వద్ద ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు హిప్పోక్రేటిక్ ప్రతిజ్ఞను అర్థం చేసుకుని కేరీర్‌లో విలువలు పాటించాలన్నారు. డాక్టర్‌గా ఎలా ఉండాలి, రోగులతో ఎలా ప్రవర్తించాలి తదితర విషయాలను తెలుసుకొని భవిష్యత్‌లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వైద్య విద్యను మృతదేహం నుంచి నేర్చుకుని భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలన్నారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రాజకుమారి మాట్లాడుతూ తెల్లకోటు శాంతి, అంకితభావానికి చిహ్నంగా వర్ణించారు. ప్రాణాలు కాపాడే డాక్టర్లు దేవుని తర్వాత దైవత్వం పొందుతారని పేర్కొన్నారు. అనంతరం తెల్లకోటు ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో అనాటమి విభాగం హెడ్ డా. ఎన్.నవీన్‌కుమార్, డా.నాగజ్యోతి, డా.జయప్రకాష్, మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్‌కో డైరెక్టర్ డా. లక్ష్మీప్రసన్న, వైస్ ప్రిన్సిపాల్ ప్రభుదీర్, దవాఖాన సూపరింటెండెంట్ నర్సింగరావు, అనాటమి అసోసియేట్ ప్రొఫెసర్ డా. జితేంద్ర తదితరులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...