హాలియాలో క్రీడాస్థలానికి నిధులు కేటాయించాలి


Thu,September 19, 2019 01:58 AM

హాలియా, నమస్తే తెలంగాణ: హాలియా మున్సిపాలిటీలో క్రీడా స్థలానికి ఏర్పాటుచేయడానికి కావాల్సిన నిధులను కేటాయించాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కోరారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హాలియా పట్టణం మధ్య ఆరు ఎకరాల భూమి నిరుపయోగంగా ఉందని క్రీడాస్థలం అభివృద్ధికి నిధులు కేటాయించాలన్నారు. గత 30ఏండ్లుగా జానారెడ్డి పాలనలో హాలియా మురికికూపంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మురికికూపంగా ఉన్న హాలియాను ఐటీ మంత్రి కేటీఆర్ సహకారంతో హాలియాను మున్సిపాలిటిగా ఏర్పాటుచేసుకున్నామన్నారు. మున్సిపాలిటిగా ఏర్పడిన తరువాత అనేక సౌకర్యాలు వచ్చాయని, మురుగుకాల్వ వ్యవస్థను, ప్రజల సమస్యలను పరిష్కరించామన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య విఙ్ఞప్తిమేరకు అసెంబ్లీ సమావేశం ముగియగానే హాలియాలో క్రీడాస్థలం ఏర్పాటుకుఅధికారులను నియోజకవర్గానికి పంపించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...