రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత


Thu,September 19, 2019 01:57 AM

సూర్యాపేట రూరల్ : అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను బుధవారం పట్టుకొని సీజ్ చేసి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతం నుంచి కొందరు ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు నిఘా పెట్టి మండలంలోని కాసరబాద గ్రామ స్టేజీ వద్ద ట్రాక్టర్లను గుర్తించి పట్టుకున్నారు. వాహనాలను సీజ్ చేసి డ్రైవర్లు వల్లపు ఉపేందర్, బానోతు దెవేందర్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...