పాడిపరిశ్రమను అభివృద్ధిపర్చాలి : ఎమ్మెల్యే భాస్కర్‌రావు


Thu,September 19, 2019 01:57 AM

మిర్యాలగూడ టౌన్ : గ్రామాల వారీగా విజయ డెయిరీ సమాఖ్యలు ఏర్పాటుచేసి పాల ఉత్పత్తులు పెంచి పాడి పరిశ్రమను అభివృద్ధి పర్చేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. ఈ మేరకు బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పదిలక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుండగా 20లక్షల లీటర్లు పాలు ఇతరరాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవల్సి వస్తుందన్నారు. ఈ పరిస్థితి అధిగమించాలంటే పాడి రైతుల భాగస్వామ్యంతో పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బర్రెల కొనుగోలుకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీ రుణాలతో పాటు పాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలు, డెయిరీ సమాఖ్యలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే నేరుగా పాలు సేకరించాలన్నారు. ఇప్పటికే సంచార పశువైద్య శాలలు గ్రామాల్లో సేవలందిస్తున్నందున పాల ఉత్పత్తులు పెంచినైట్లెతే ప్రజలకు ఉపాధి పెరిగి గ్రామాలు సమగ్రాభివృద్ధి సాధిస్తాయని సభ దృష్టికి తీస్కెళ్లినట్లు తెలిపారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...