ఎంజీయూ ఖోఖో మహిళా జట్టు ఎంపిక


Thu,September 19, 2019 01:57 AM

నల్లగొండ విద్యావిభాగం: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గల కళాశాలల్లోని క్రీడాకారులకు నిర్వహిస్తున్న యూనివర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల, మహిళల ఖోఖో పోటీలు బుధవారం హోరాహోరీగా సాగాయి. మహిళా టీమ్ ఎంపికను పూర్తి చేశారు. అయితే పురుషుల విభాగంలో ఫైనల్స్ కొనసాగాయి. మహిళల జట్టుకు ఎంపికైన క్రీడాకారులను ఎంజీయూ స్ఫోర్ట్స్ బోర్డుకార్యదర్శి డా. జి. ఉపేందర్‌రెడ్డి, ఎంజీయూ పీడీలు ఆర్.మురళి, డా. వై. శ్రీనివాస్‌రెడ్డి, ఎన్జీ కళాశాల పీడీ మల్లేశం అభినందించారు. మహిళా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు త్వరలో జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారు.

జట్టుకు ఎంపికైన క్రీడాకారులు..
ఎన్. నందిని, జి.శిరీష, జె.ప్రత్యూష(టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎఆర్‌పీడీసీడబ్ల్యూ, భువనగిరి), డి. జ్యోతిలక్ష్మీ, వి.భవానీ(టీటీడబ్యూఆర్‌డీసీ, దేవరకొండ), ఎం. స్వప్న, సీహెచ్.చైతన్య (టీటీడబ్ల్యూర్‌డీసీ, సూర్యాపేట), పి. నాగపూర్ణ(ఎంఎస్‌ఆర్‌ఐపీఈ, సూర్యాపేట),టి.దివ్య, కె.చైతన్య(టీఎస్‌డబ్ల్యూఆర్‌డీసీ, నల్లగొండ), పి. నవ్య, సీహెచ్. దుర్గాభవానీ(గోపాలకృష్ణ కాలేజీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, హాలియా).

ట్రాన్స్‌కో బాస్కెట్‌బాల్ పోటీల్లో జిల్లా జట్టు ప్రతిభ
నల్లగొం డ స్పోర్ట్స్ : ఈనెల 16 నుంచి 18 వరకు హైదరాబాద్‌లోని జిం ఖానా గ్రౌం డ్స్‌లో జరిగిన టీఎస్ ట్రాన్స్‌కో, డిస్కమ్ ఇంటర్ సర్కిల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో జిల్లా జుట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ప్రథమ స్థానంలో కరీంనగర్ జట్టు నిలువగా నల్లగొండ జట్లు ద్వితీయ స్థానం కైవసం చేసుకుంది. హోరాహోరీగా తలపడి జిల్ల్లా జట్టును ద్వితీయ స్థానంలో నిలిపిన జట్టును టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ ఎస్‌ఈ కృష్ణయ్య, డీఈ వెంకటకృష్ణయ్య, రామారావు, వెంకటరమణరెడ్డి, నరేందర్‌రావు, వెంకటయ్య, సురే ష్, పాండు, బాలు జట్టుకు అభినందనలు తెలిపారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...