మళ్లీ తెరుచుకున్న సాగర్ గేట్లు


Wed,September 18, 2019 02:22 AM

- నాగార్జునసాగర్ 2 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల
- ప్రాజెక్టు నీటిమట్టం 590 అడుగులు
నందికొండ : శ్రీశైలం నుంచి వచ్చి చేరుతున్న ఇన్‌ఫ్లోతో నాగార్జునాసాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండడంతో మంగళవారం రాత్రి 8 గంటలకు అధికారులు రెండు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఆదివారం రాత్రి నుంచి గేట్లను పూర్తిగా మూసి వేసిన అధికారులు ఎగువ నుంచి వచ్చే నీటిని ప్రాజెక్టులో నిల్వ చేయడంతో రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 590 అడుగులకు చేరుకొని 312.0431 టీఎంసీలు నిల్వ ఉంది. శ్రీశైలం నుంచి 72684 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండడంతో ఎన్నెస్పీ అధికారులు రిజర్వాయర్ 2 క్రస్ట్ గేట్ల నుంచి 16200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

58314 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో
నాగార్జునసాగర్ జలాశయం నుంచి ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 28664 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 4416 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 6324 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, డీటీ గేట్స్ (డైవర్షన్ టన్నల్ ) ద్వారా 10 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి మొత్తం 58314 క్యూసెక్కుల నీరు ఔట్‌ఫ్లోగా విడుదలవుతోంది. శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం 883.90 అడుగులుగా ఉండగా రిజర్వాయర్‌లో 208.7413 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలంకు ఎగువ నుంచి 50734 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది.
మూసీ నీటిమట్టం 629 అడుగులు
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రం వరకు నీటిమట్టం 629.77 అడుగులు (1.36 టీఎంసీలు)గా ఉంది. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఎలాంటి ఇన్‌ఫ్లో లేకపోగా ప్రాజెక్టు నుంచి కూడా నీటి విడుదల చేయడం లేదు.

పులిచింతల@174.83అడుగులు
చింతలపాలెం : పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175(45.77 టీఎంసీలు)అడుగులకు ప్రస్తుతం 174.834(45.5133 టీఎంసీలు) అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి సుమారు 24259 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు మొత్తం గేట్లు 24గేట్ల్ల నుంచి లీకేజీల ద్వారా 1000క్యూసెక్కుల నీరు, తెలంగాణ విద్యుత్ ఉపకేంద్రం ద్వారా 9000 క్యూసెక్కులు కలిపి మొత్తం 10000 క్యూసెక్కుల నీరు అవుట్‌ఫ్లోగా విడుదలవుతుంది.

ఎడమ కాల్వకు నీటి విడుదల షెడ్యూల్‌లో మార్పు
మిర్యాలగూడ టౌన్: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద నీటి ఉధృతి కొనసాగుతుండడంతో ఎడమ కాల్వకు నీటి విడుదల తేదీల్లో స్వల్ప మార్పులు చేసినట్లు ఎన్నెస్పీ ఈఈ నాగేశ్వర్రావు తెలిపారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వానాకాలం పంటల సాగు కోసం ప్రస్తుతం నీటిని విడుదల చేస్తుండగా అందులో కొంత మార్పు చేసినట్లు వెల్లడించారు. మొదటి విడత ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 17 వరకు, రెండో విడుత సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వరకు, మూడో విడుత అక్టోబర్ 9 నుంచి 17 వరకు, నాలుగోవిడుత అక్టోబర్ 24 నుంచి నవంబర్ 1 వరకు, ఐదో విడుత నవంబర్ 8నుంచి 16వరకు, ఆరోవిడుత నవంబర్ 23 నుంచి డిసెంబర్ 1వరకు నీటిని విడుదల చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రకటించిన తేదీల వారీగా రైతులు సాగుకు సన్నద్ధం కావాలని సూచించారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...