ఆస్తి కోసం కన్నతల్లిని కొట్టి చంపిన కొడుకు


Sun,September 15, 2019 01:49 AM

దేవరకొండ, నమస్తేతెలంగాణ : ఆస్తికోసం కన్నతల్లిని కొడుకే కొట్టి చంపిన ఘటన శుక్రవారం రాత్రి దేవరకొండ పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. దేవరకొండ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో గుర్రం మణెమ్మ(95) నివాసముంటోంది. ఈమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉం డగా అందరికీ వివాహాలయ్యాయి. కొడుకులిద్దరు ఉద్యోగార్థం ఇతర ప్రాంతాల్లో ఉంటుండగా మణెమ్మ మాత్రం ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటోంది. మణెమ్మ పేరుమీద పట్టణంలో రెండు మడిగెలు ఉండగా అం దులో ఒక దానిని తనకు ఇవ్వాలని ఆమె పెద్ద కొడుకు గుర్రం నర్సింహ కొంత కాలంగా వేధిస్తున్నాడు.

హైదరాబాద్‌లో నివాసముంటున్న నర్సింహ శుక్రవారం దేవరకొండకు వచ్చాడు. మడిగె విషయమై తల్లితో వాగ్వాదానికి దిగిన నర్సింహ కోపంతో ఆమెను రాయితో కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తీసుకెళ్లగా చికిత్స పొం దుతూ మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దేవరకొండ డీఎస్పీ మహేశ్వర్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

117
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...