ఇద్దరు గొలుసు దొంగలు అరెస్టు


Sun,September 15, 2019 01:46 AM

కోదాడ రూరల్: పలు ప్రాంతాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను కోదాడ పట్టణ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారివద్ద నుంచి 16 తులాల బంగారు ఆభరణాలు, రెండు ద్విచక్రవా హనాలు, సెల్‌ఫోన్ స్వాదీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు డివిజన్ పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి శనివారం పట్టణ వెల్లడించారు. మిర్యాలగూడెం పట్టణానికి చెందిన చామల పవన్‌కుమార్, కామాజీ వంశీలు చెడు వ్యసనాలకు బానిసలై స్నేహితులతో కలిసి దొంగతనాలను పాల్పడుతున్నట్లు తెలిపారు. కోదాడ పట్టణంలో శుక్రవారం సాయంత్రం వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు నెంబర్ లేని ద్విచక్రవాహనంపై ముఖానికి మాస్క్ ధరించి వస్తున్న వారిని పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా వారు వేగంగా వాహనంపై వెళ్తుండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈనెల 3వ తేదీన సూర్యాపేట రోడ్డులో పెట్రోల్‌బంకు సమీపంలో గుండా కల్యాణి మహిళ మెడ నుంచి గొలుసు దొంగిలించేదుకు ప్రయత్నించి విఫ లమైనట్లు చెప్పారు. పవన్‌కుమార్, వంశీలు గుంటూరు జిల్లా నర్సారావుపేట, గురజాల, ముప్పాళ్ల, సూర్యాపేట జిల్లా చివ్వెంల, కుడకుడ గ్రామాల్లో పలు దొంగతనాలకు పాల్పడిన్నట్లు పేర్కొన్నారు. నేరస్తులను అరెస్టు చేసి, సొత్తును రికవరీ చేయడంలో కృషి చేసిన సీఐ యూ. శ్రీనివాసులరెడ్డి, ఎస్‌ఐ క్రాంతికుమార్, సిబ్బంది కె.బాల రామ్‌రెడ్డి, నర్సింహాను ఆయన అభినందించారు. రివార్డుకై ఉన్నతాధికారులకు సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...