శిథిలమైన విద్యుత్ స్తంభాలను తొలగించాలి


Sun,September 15, 2019 01:45 AM

నల్లగొండ రూరల్ : గ్రామాల్లో శిథిలమైన విద్యుత్ స్తంభాలను తొలగించాలని, పోల్స్ మధ్యలో లూజ్‌లైన్లను సరిచేయాలని హైదరాబాద్ నుంచి వచ్చిన విద్యుత్ శాఖ డైరెక్టర్ మదన్‌మోహన్ అధికారులకు ఆదేశించారు. విద్యుత్ శాఖ నిర్వహిస్తున్న 30 రోజుల పవర్ వీక్‌లో భాగంగా శనివారం బుద్దారం గ్రామాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న విద్యుత్ పనుల పురోగతిని సమీక్షించారు. గ్రామంలో పర్యటించి ప్రజలను విద్యుత్ సమస్యల గురించి అడిగి తెలుసుకోవాలన్నారు. అనంతరం గ్రామంలో నూతనంగా స్ట్రీట్ లైట్ల కోసం ఏర్పాటు చేసిన మీటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ అధికారులు రాష్ట్రం వ్యాప్తంగా గ్రామాల్లో సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. మలి విడతలో వ్యవసాయ బావుల దగ్గర లూజ్ లైన్ల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గ్రామంలో స్ట్రీట్‌లైట్లకు అయ్యే బిల్లులు గ్రామ పంచాయతీ నిధుల నుంచి చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆయన వెంట ఎస్‌ఈ కృష్ణయ్య, డీఈ విద్యాసాగర్, ఏడీఈ టౌన్ శేఖర్, ఏఈ శ్రీనివాసరావు, సబ్ ఇంజనీర్ హిమవంతరెడ్డి, సర్పంచ్ బకరం యాదమ్మవెంకన్న, సెక్రటరీ లక్ష్మీ, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు బకరం వెంకన్న, కాంట్రాక్టర్ సత్యం, గ్రామస్తులు ఉన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...