ప్రభుత్వ భూములను రక్షించాలి


Sat,September 14, 2019 04:26 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకుండా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సూచించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందన్నారు. ధరణిలో ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించి పట్టాదార్ పాస్ పుస్తకాలు రైతులకు అందజేయాలని ఆదేశించారు. తహసీల్దార్లు సమయపాలన పాటించి ప్రజలకు సేవలు అందించాలని, కింది స్థాయి సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విధుల పట్ల అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందికి సూచించాలన్నారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో రెవెన్యూ సిబ్బంది సహకారం అందించాలన్నారు.

హరితహారంలో చురుగ్గా పాల్గొని మొక్కలు నాటాలన్నారు. శ్మశాన వాటికలు, ఖనన స్థలం, డంపింగ్‌యార్డులకు గ్రామ పంచాయతీల్లో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి కేటాయించాలని అధికారులకు సూచించారు. 30 రోజుల ప్రణాళికకు సంబంధించి సూపరింటెండెంట్‌ను నియమించినందున రోజు వారి నివేదికలు అందజేయాలన్నారు. ఓటర్ తన స్థితిని పరిశీలించుకునేందుకు ఎన్‌వీఎస్‌పీ పోర్టల్, ఓటర్ హెల్ఫ్‌లైన్ ఆయా ఆర్డీఓ కార్యాలయంలో ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. తహసీల్దార్లు ఓటర్లకు ఈ విషయంపై అవగాహన పరిచేందుకు విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ చంద్రశేఖర్, డీఆర్వో రవీంద్రనాథ్‌తో పాటు ఆర్డీఓలు, తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...