రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి


Sat,September 14, 2019 04:25 AM

నల్లగొండ క్రైం : రాంగ్‌రూట్‌లో వచ్చిన కారు ఇద్దరి ప్రాణాలను బలిగొన్న సంఘటన గురువారం అర్ధరాత్రి నల్లగొండ కలెక్టరేట్ సమీపంలో ఉన్న కావేరి వైన్స్ సమీపంలో జరిగింది. వన్‌టౌన్ సీఐ సురేష్ తెలిపిన వివరాలు.. మహిళా ప్రాంగణానికి చెందిన శవాన్ శివ(20), కట్టెబోయిన మహేష్(18)లు మహిళా ప్రాంగణంలో ఉన్న వినాయకుడి వద్ద రాత్రి 11 గంటలకు పూజలు నిర్వహించుకుని బైక్‌పై కలెక్టరేట్ వైపు వస్తున్నారు. అదే సమయంలో రాంగ్‌రూట్‌లో ఉన్న గుర్తు తెలియని కారు ఆ బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కారు రాంగ్‌రూట్‌లో రావడంతో ఈ ప్రమాదం జరిగిందని సీఐ సురేష్ పేర్కొన్నారు. శివ కూలి చేస్తుండగా మహేష్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతు కూలికి వెళ్లేవాడు. ఒకే కాలనీకి చెందిన యువకులు ఒకేసారి మృతిచెందడంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. శివతండ్రి గునాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ సీఐ సురేష్‌కుమార్ కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను అప్పగించినట్లు తెలిపారు. కారు అచూకి కోసం పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలిస్తామని సీఐ పేర్కొన్నారు.

110
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles