బడి పంతులుకు బడిత పూజ..?


Sat,September 14, 2019 04:24 AM

చివ్వెంల : మండలంలోని ఓ బడి పంతులకు విద్యార్థుల తల్లిదండ్రుల చేతిలో బడిత పూజ జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నిబంధనల మేరకు ఉపాధ్యాయులకు తరగతి గదిలో సెల్‌ఫోన్ ఉండకూడదు. అలాంటిది ఓ ఉపాధ్యాయుడు సెల్ తన వద్ద ఉంచుకోడంతోపాటు విద్యార్థినులకు నీలి చిత్రాలు చూపించి వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. ఇలా ఒకటికి రెండుసార్లు చూపించడంతో విసుగెత్తిన విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో ఆగ్రహంతో పాఠశాలకు వెళ్లి సదరు ఉపాధ్యాయుడికి మూడ్రోజుల క్రితం దేహశుద్ధి చేసినట్లు తెలుస్తుంది. చిన్నారులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే కీచకపాత్ర పోషించడం గత ఏడాదిన్నరలో మండలంలో అక్కడక్కడా వెలుగులోకి వచ్చాయి. కొన్నింట్లో సంఘాలు కల్పించుకొని సెటిల్‌మెంట్లు చేస్తుండగా రెండు సంఘటనల్లో మాత్రం కేసులు కూడా నమోదైన విషయం విదితమే. తాజాగా మండలంలో మరో బడి పంతులి కీచక పర్వం గురించి ఉపాధ్యాయవర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. చిన్నారులకు నీలి బొమ్మలు చూపించడంతో పాటు వెకిలి చేష్టలకు పాల్పడడంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి కాస్తగట్టిగానే బుద్ధి చెప్పినట్లు పేరు బహిర్గతం చేయడానికి నిరాకరించిన ఓ ఉపాధ్యాయుడు ఖచ్చితమైన సమాచారం ఇచ్చాడు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...