రైతు సంక్షేమమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమని


Mon,August 26, 2019 01:55 AM

తిరుమలగిరి (సాగర్) : రైతు సంక్షేమమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని అల్వాల గ్రామంలో రూ.1.10 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 4విద్యుత్ సబ్ స్టేషన్లను సుమారు రూ.6కోట్లతో ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగంపై రైతులకు విశ్వాసం కలిగించడానికి, ధైర్యం ఇవ్వడానికి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందన్నారు. గత ప్రభుత్వ హయంలో ప్రాజెక్టులు మన దగ్గరే ఉన్నా.. నదులు ప్రవహిస్తున్నా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రాష్ట్ర రైతాంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత సరఫరా విద్యుత్‌ను అందించిన రాష్ట్రంగా రికార్డు సృష్టించిందని తెలిపారు. వ్యవసాయ రంగంపైన సీఎం కేసీఆర్ దృష్టి పెట్టి రైతులను అన్నివిధాలుగా ఆదుకున్నారన్నారు. మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, నూతన ప్రా జెక్టుల నిర్మాణాలతో వేల ఎకరాలను సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

నాగార్జునసాగర్ ఎడమ కాల్వ మొదటి తూము అయిన రాజవరం మేజర్ చివరి ఆయకట్టుకు గతంలో సాగునీరందేది కాదని టీఆర్‌ఎస్ హయంలోనే చివరి ఆయకట్టుకు సాగు నీరందించామని తెలిపారు. ఆంధ్రోళ్ళు పెట్టిన పదం టేలాండ్ అనేది రాష్ట్రంలో ఎక్కడా కూడా వినపడకూడదని చివరి ఆయకట్టు వరకు ప్రణాళిక ప్రకా రం సాగునీరందించిన ఘనత సీఎం కేసీఆర్ అన్నారు. 18 ఏళ్లుగా నత్తనడకన సాగిన లోలెవల్ కెనాల్‌ను వెంటనే పూర్తి చేసి జిల్లా రైతాంగానికి సాగునీరందించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లోవోల్టేజీ సమస్య లేదన్నారు. వ్యవసాయంపై రైతులకు లాభసాటిని చేయడానికి కేసీఆర్ అనుసరిస్తున్న నూతన విధానాన్ని సఫలీకృతమైందన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాల అమలులో ఆదర్శవంతంగా నిలిచిందని ధీమా వ్యక్తం చేశారు. రైతు లు పండించిన పంటలను ధర నిర్ణయించడంలో భాగస్వామ్యం చేసేందుకు ప్రభుత్వం రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసిందని వెల్లడించారు.

అంతకు ముందు మంత్రికి ఎమ్మెల్యే నర్సింహయ్య పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వా గతం పలికారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, జడ్పీ చైర్మన్ బండా న రేందర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్‌నాయక్, జడ్పీ వైస్ చై ర్మన్ ఇరిగిపెద్దులు, రాష్ట్ర నాయకులు ఎంసీ కోటిరెడ్డి, వేమిరెడ్డి నర్సింహారెడ్డి, జడ్పీటీసీ ఆంగోత్ సూర్యభాషనాయక్, ఎంపీపీ ఆంగోత్ భగవాన్‌నాయక్, పెద్దవూర జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, ఎం పీపీ చెన్ను అనురాధ, ఎస్‌ఈ కృష్ణయ్య, డీఈ కన్‌స్ట్రక్షన్ రామారావు, మిర్యాలగూడ ఆర్డీఓ జగన్నాథరావు, డీఈ వెంకటకృష్ణయ్య, ఏడీఈ సూర్యనాయక్, ఏఈలు శ్రీనునాయక్, శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్లు శాగం రాఘవరెడ్డి, రావుల చినభిక్షం, అల్లి పెద్దిరాజు, ఎక్కలూరి శ్రీనివాస్‌రెడ్డి, నాగెండ్ల వెంకట్‌రెడ్డి, కేవీ రామారావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...