నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


Mon,August 26, 2019 01:47 AM

మిర్యాలగూడ రూరల్ : మండల పరిధిలోని నందిపహాడ్ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ట్రాన్స్‌కో రూరల్ ఏఈ దైద శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో నూతన విద్యుత్‌లైన్లు ఏర్పాటు పనులు చేపడుతున్నందున సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గోప సముద్రంతండా, రాఘవాపురంతండా, ఐలాపురం, చిల్లాపురం, నందిగూడెం, మైసమ్మకుంటతండా, వాటర్‌ట్యాంక్ తండా, నందిపహాడ్ ,రవీంద్రనగర్ గ్రామ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...