చిత్రలేఖనంలో వర్డ్ అండ్ డీడ్ విద్యార్థి ప్రతిభ


Mon,August 26, 2019 01:46 AM

మిర్యాలగూడ అర్బన్ : జాతీయస్థాయిలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో స్థానిక వర్డ్ అండ్ డీడ్ పాఠశాల విద్యార్థి ప్రతిభ కనబర్చి బంగారు పతకాన్ని సాధించింది. హైదరాబాద్‌లోని నాంపల్లిలోగల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆదివారం నేషనల్ టాలెంట్ ఆర్ట్ కాంపీటేషన్ పోటీలు నిర్వహించగా, ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ పతాకంపై డ్రాయింగ్ వేసిన పాఠశాలకు చెందిన 4వ తరగతి విద్యార్థిని శ్రీవల్లి ప్రథమస్థానంలో నిలువడంతో బంగారు పతకం సాధించింది. మెడల్ సాధించిన విద్యార్థిని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ నవీన్‌రెడ్డి సాయంత్రం పాఠశాలలో సన్మానించారు. రూ.5000 నగదు ప్రోత్సాహకం అందజేశారు. విద్యార్థులకు విద్యతోపాటు ఆర్ట్, క్రీడల్లో శిక్షణ ఇస్తున్నా మన్నారు. కార్యక్రమంలో విద్యార్థిని తండ్రి ఎల్లారెడ్డి, ఉపాధ్యాయులు, సాయికుమార్‌లు తదితరులున్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...