రైతులకు మద్దతు ధర కల్పిస్తాం


Mon,August 26, 2019 01:46 AM

మిర్యాలగూడ, నమస్తేతెలంగాణ: రైతులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ మద్దతు ధర కల్పించేందుకు కృషి చేస్తామని మార్కెట్‌కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన అనంతరం మాట్లాడారు. రైతుల, వ్యాపారుల మధ్య సమన్వయం చేస్తూ రైతులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తాననిపేర్కొన్నారు. తనపై ఎంతో నమ్మకంతో మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియామకం చేసిన సీఎం కేసీఆర్, మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను గజమాలతో సత్కరించారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...