27న కాంగ్రెస్ పార్టీ సమావేశం


Mon,August 26, 2019 01:46 AM

-డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్
మిర్యాలగూడ అర్బన్ : పట్టణంలోని శ్రీలక్ష్మీ కళ్యాణ మండపం ఫంక్షన్ హాల్లో ఈనెల 27న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నామని డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్ తెలిపారు. ఆదివారం స్థానిక రాజీవ్ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మధ్యాహ్నం 2 గంటలకు జరుగబోయే సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డితో పాటు పలువురు ముఖ్యనాయకులు హాజరవుతున్నందున పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో చెన్నబోయిన శ్రీనివాస్, కృష్ణయ్య, రాజు, సలీమ్, ఆరీఫ్, వెంకటేశ్వర్లు, గిరి పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...