గ్రామ సమగ్రాభివృద్ధికి 60రోజులు


Sun,August 25, 2019 01:57 AM

-పచ్చదనం పరిశుభ్రత పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ
-ఆకస్మిక తనిఖీలు.. ఫ్లయింగ్ స్క్వాడ్‌ల ఏర్పాటు
-పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగోన్నతి జాబితా సిద్ధం!
-నిర్లక్ష్యం వహించే అధికారులు, ప్రజాప్రతినిధులపై కొరడా
-కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలుపై సర్కార్ దృష్టి

నీలగిరి : నూతన పం చాయతీరాజ్ చట్టం పకడ్బందీగా అమలు చేసేందు కు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే కార్యదర్శుల నియామకం పూర్తికాగా ఈఓఆర్‌డీ, ఎంపీడీఓ, డీఎల్‌పీఓలకు పదోన్నతులు కల్పించి కార్యక్ర మం విజయవంతం చేసేందుకు శ్రీకారం చుడుతున్నారు.

60రోజుల ప్రత్యేక కార్యాచరణ...
జిల్లాలో 60రోజుల ప్రత్యేక కార్యాచరణ అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీలు ఏర్పాటు చేసి ఇళ్ల యజమానులు, రైతులకు అవసరమైన మొక్కలను ముం దుగానే తెలుసుకుని సరఫరా చేయనున్నారు. అదే విధంగా 100శాతం పన్ను వసూలు బాధ్యతను కార్యదర్శికి అప్పగించనున్నారు. వివాహ రిజిస్ట్రేషన్, నమోదు, జనన, మరణ రికార్డులు, పారిశుధ్యంతో పాటు పాడుబడిన బావులు, నీటి గుంత లను పూడ్చనున్నారు. అదే విధంగా 2వేల జనాభాకు ఓ శ్మశాన వాటికను 6నెలల్లో పూర్తి చేయనున్నారు. డంపింగ్ యార్డులు, కమిటీ హాలు, గోదాముల నిర్మాణానికి స్థలాలు కేటాయించనున్నారు.

ఉద్యోగోన్నతుల జాబితా సిద్ధం...
జిల్లా మండల పరిషత్ కార్యాలయాల్లో పని చేస్తున్న పంచాయతీరాజ్ ఉద్యోగులకు పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. జిల్లాలో 844 గ్రామ పంచాయతీలు ఉండగా 584మంది కార్యదర్శులు విధుల్లో చేరారు. 12మంది వీఆర్‌ఓలుగా రెవెన్యూకు బదిలీ కాగా మరో 15నుంచి 20 మంది గ్రూప్2, ఎస్‌ఐ ఇతర ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సిబ్బందికి ఉద్యోగోన్నతులు కల్పించనున్నారు. పాత జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడ నుంచే ఉమ్మడి నల్లగొండ జిల్లా పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగోన్నతి కల్పించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...