పేద విద్యార్థులకు అండగా నిలవాలి


Sun,August 25, 2019 01:54 AM

-నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
శివాజీనగర్ : ప్రతీ ఒక్కరూ పేద విద్యార్థులకు అండగా నిలవాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం ఆయన నివాసంలో పేద విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవిదార్ధులకు చేయూతనివ్వడం సంతోషంగా ఉందన్నారు. ఆదివారం తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చే నాయకులు, అభిమానులు పూలదండలకు బదులుగా పేద విద్యార్థులకు ఉపయోగపడే పెన్నులు, పెన్సిళ్లు, కాపీలు తీసుకురావాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే కంచర్ల కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో నాగార్జునరెడ్డి, నకిరేకంటి కాశయ్యగౌడ్, కటికం సత్తయ్యగౌడ్, శ్రీపాద కృష్ణమాచారి, మందడి సైదిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, దేప వినోభారెడ్డి, దేవేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...