ప్రతీ నీటి బొట్టును ఒడిసి పట్టాలి


Sun,August 25, 2019 01:54 AM

వేములపల్లి : నీటిని ఆదా చేస్తేనే మనిషి మనుగడ సాధ్యమని ప్రతి ఒక్కరూ గుర్తించి ప్రతీ నీటి బొట్టును ఒడిసి పట్టాలని వైస్ ఎంపీపీ పాదూరి గోవర్ధని అన్నారు. శనివారం మండల పరిధిలోని మొల్కపట్నం ప్రాథమిక పాఠశాల విద్యార్థ్దులకు, గ్రామస్తులకు ఏర్పాటు చేసిన జలశక్తి అభియాన్‌లో సర్పంచ్ రెమడాల కరుణాకర్‌తో కలిసి పాల్గొని మాట్లాడారు. భవిష్యత్‌లో నీటి ఎద్దడి రాకుండా నీటిని వినియోగించుకోవాలని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి భూగర్భ జలాల పెంపునకు పాటుపడాలన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ వెంకన్న, ఫీల్డ్ అసిస్టెంట్ భాగ్యమ్మ, యాదమ్మ, పేరెళ్లి నగేష్ పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...