సభకు టీఆర్‌ఎస్ శ్రేణులు తరలిరావాలి: ఎమ్మెల్యే


Sun,August 25, 2019 01:53 AM

మిర్యాలగూడ,నమస్తేతెలంగాణ: మిర్యాలగూడ మం డలం అవంతీపురం వ్యవసాయమార్కెట్‌లో నేడు జరిగే మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు కోరారు. శనివారం అవంతీపురం మార్కెట్‌లో సభ ఏర్పాట్లు, పార్కిం గ్ వసతులు పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ఈసభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలు, పట్ణణ ప్రాంతం నుంచి టీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు భారీగా తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎన్‌బీఆర్‌ఎఫ్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ, మార్కెట్ సెక్రటరీ ప్రసాద్‌రావు, వింజం శ్రీధర్, కోటేశ్వర్‌రావు, తదితరులు ఉన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...