అంగన్‌వాడీలో జన్మదిన వేడుకలు


Sun,August 25, 2019 01:52 AM

దామరచర్ల: అంగన్‌వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కేజేఆర్ కాలనీ ఎంపీటీసీ వీరూనాయక్, సర్పంచ్ యమున అన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దతండా అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం జయదీప్ అనే విద్యార్థి మొదటి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. కేక్ కట్‌చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ఆశోక్, అంగన్‌వాడీ కార్యకర్తలు కమలమ్మ, సుశీల, లాలి, శారద, గ్రామ పెద్దలు పీక్యూనాయక్, దస్రూ, కిషన్, రామ, చందు, రమేష్ పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...